గుజరాత్ సర్కార్ కళాశాల అత్యుత్సాహం
యూనిటీ రన్‌లో పాల్గొనలేదని విద్యార్థులపై చర్యలు
జామ్‌నగర్, డిసెంబర్ 22 (జనంసాక్షి) :
గుజరాత్‌లోని ఓ సర్కారు కళాశాల ప్రభుత్వ భక్తిని చాటుకునేందుకు దారుణంగా ప్రవర్తించింది. యూనిటీ రన్‌లో పాల్గొనలేదని ఆరోపిస్తూ విద్యార్థులకు నోటీసులు జారీ చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు మద్దతుగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ నేతృత్వంలో ఈనెల 15న దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే జామ్‌నగర్ సమీపంలోని భన్వాడ్ పట్టణంలో గల ఓ కామర్స్ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులు ఈ పరుగులో పాల్గొనలేదన్న కారణంతో ఒక్కొక్కరూ రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై స్థానిక మీడియా వార్తలు ప్రసారం చేయడంతో సదరు విద్యాసంస్థ వెనక్కు తగ్గింది. తాను జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకుంది. అయితే కళాశాల అధికారులు జరిమానా కోరడమే కాకుండా తమను పరీక్షలకు కూడా హాజరుకానివ్వబోమని బెదిరించారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ జేఆర్ వంజా వివరణ ఇస్తూ విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో విద్యార్థులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించామని, పాల్గొనని వారికి నోటీసులు జారీ చేసినా తర్వాత ఉపసంహరించుకున్నామని, ఎవరి నుంచీ వసూలు చేయలేదని, అలాగే పరీక్షలకు హాజరుకాకుండా కూడా నిరోధించలేదని ఆయన పేర్కొన్నారు.