75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదానం చేసిన మల్లిగారి రాజు
జనగామ (జనం సాక్షి) ఆగస్ట్17: మనం స్వతంత్రం పొందిన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు .ఈ సందర్భంగా ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ శుభ సందర్భంలో రక్త దానం చేయాలని అనే ఆకాంక్షతో 84 వసారి ముందుకు వచ్చి రక్తం దానం చేసిన జనగామ టిఆర్ఎస్ నాయకులు మల్లి గారి రాజు వారిని ప్రత్యేకంగా అభినందించిన స్థానిక శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ కార్యక్రమంలో జనగామ అదనపు కలెక్టర్ అబ్దుల్ అమిద్.. తదితరులు పాల్గొన్నారు