ఒకజాతి రెండు రాష్ట్రాలు
తెలంగాణ అరవై ఏండ్ల తండ్లాట
భాజపా ద్వంద్వ వైఖరి
సీమాంధ్ర పరిస్థితిని ఎదుర్కొంటాం : జైరామ్ రమేశ్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
తెలుగు జాతి ఒక్కటేనని, తెలుగువారి కోసం తాము రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ తెలిపారు. అందరూ ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ తొందరపాటు నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య నానుతోందని. గత పదేళ్లుగా దీనిని అధ్యయనం చేశాక అందరి ఆమోదంతోనే విభజనకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇదేదో ఎన్నికల్లో అబ్దిపొందేందుకు తీసుకున్న నిర్ణయం అస్సలు కాదన్నారు. హైదారబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రి జైరాం గురువారం గాంధీభవన్‌లో పిసిసి చీఫ్ బొత్స, మాజీ ఐఎఎస్ కొప్పుల రాజుతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై తాము 2004లోనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 2009లో కూడా హావిూ ఇచ్చామన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోనూ, కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ ప్రకటించామన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిందని గుర్తుచేశారు. అలాగే జైఆంధ్రా ఉద్యమం1972లో వచ్చిందన్నారు. ఆ తరవాత పరిణామాలను పరిశీలించి అన్ని పార్టీలు ఆమోదించాక ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. దివంగత సిఎం వైఎస్ కూడా అసెంబ్లీలో దీనికి సంబంధించి ప్రకటన చేశారని అన్నారు. ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర విభజన చేశారన్న ఆరోపణలను కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ఖండించారు. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని తాము పదేళ్ల పాటు పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2013 జూన్‌లోనే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని, సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత అన్ని పార్టీల్లో విభజన వచ్చిందన్నారు. 2009 అసెంబ్లీలో వైఎస్ తెలంగాణ ఏర్పాటుపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ రాజ్యసభలో బిజెపి మెలికపెట్టిందన్నారు. ఆర్టికల్ 3, 4 ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతల అప్పగింత రాజ్యాంగ బద్ధమేనన్నారు. రైతులకు సాగునీటి హక్కులను పరిరక్షించేందుకు కృష్ణా, గోదావరి జలమండళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రాంతాన్ని విభజించి సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేశామని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి నష్టంలేదని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజం కోసమే రాష్టాన్న్రి విభజించామనేది తప్పని స్పష్టం చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర విభజన చేశారన్న ఆరోపణలను కేంద్ర మంత్రి జైరాం రమేష్ తోసిపుచ్చారు. రాజ్యాంగబద్దంగానే విభజన చేశామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తొందపాటుగా వ్యహరించలేదన్నారు. పదేళ్ల పాటు సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే విభజన చేశామన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల పరిరక్షణ అధికారాలు గవర్నర్ చేతిలో ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్ ఆదాయం అంతా తెలంగాణకే వెళుతోందని, ఒక్కరూపాయి కూడా సీమాంధ్రకు వెళడం లేదని వెల్లడించారు. అందుకోసమే సీమాంధ్రకు ప్రధాని 6 పాయింట్ల ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని జైరాం రమేష్ పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి పదేపదే చెప్పారని, ఆంధప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఉంటుందని చెప్పారు. విభజన విషయంలో అన్ని పార్టీలు నిలువునా చీలిపోయాయని చెప్పారు. తెలంగాణ డిమాండ్ అరవయ్యేళ్లుగా ఉందన్నారు. 2004లో తెలంగాణపై కాంగ్రెసు పార్టీ హామీ ఇచ్చిందని, అన్ని పార్టీలను సంప్రదించాక 2009లో కేంద్రం నిర్ణయం తీసుకుందని, అన్ని దశలలో అందరితోను చర్చలు జరిపామన్నారు. వైఎస్ ఈ విషయమై అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారని చెప్పారు. తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు- చేయాలని వైఎస్ పదేపదే కేంద్రానికి చెప్పారన్నారు. విభజన నిర్ణయం హడావుడిగా తీసుకున్నది కాదన్నారు. పదేళ్లుగా సంప్రదింపుల పక్రియ కొనసాగుతోందన్నారు. బిజెపిది లోకసభలో ఓ విధానం, రాజ్యసభలో మరో విధానం ఉందని ఆరోపించారు. 1969లో తెలంగాణ ఉద్యమం, 1970లలో జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు నిర్ణయం తీసుకుందన్నారు. 2013 జూలై30న సిడబ్ల్యూసి తెలంగాణపై నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని పార్టీలు నిర్ణయం చెప్పాకే కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని, విభజన రాజ్యాంగవిరుద్ధం అనడం సరికాదన్నారు. విభజన హడావుడి నిర్ణయం కాదన్నారు. ఆర్టికల్ 3ని బలపరుస్తూ సుప్రీం కోర్టు నాలుగుసార్లు తీర్పు చెప్పిందన్నారు. హైదరాబాద్ విూద వచ్చే రెవెన్యూ ఆదాయం తెలంగాణదే అన్నారు. హైదరాబాద్ ఆదాయం ఏదీ సీమాంధ్రకు వెళ్లదన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఆస్తుల పరిరక్షణ, శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలో ఉంటాయని చెప్పారు. గవర్నర్ పరిధిలో ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. అలాగే పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే విభజన చేశారన్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. రాష్టాల్రు వేరైనా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. విద్యాసంస్థల్లో పదేళ్ల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పారు. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విధానాల ప్రకారం నీటి పంపిణీ జరుగుతుందన్నారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి రివర్ బోర్డు సీమాంధ్రలో, కృష్ణా రివర్ బోర్డు తెలంగాణలో ఉంటుందని, ఆ రెండు బోర్డులదే నీటి పంపిణీ బాధ్యత అన్నారు. సీమాంధ్ర రాజధాని ఎంపికకు నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీమాంధ్రలోని గుంటూరు, విశాఖ, కర్నూలు, తిరుపతి, విజయవాడలలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు అధికంగా వస్తున్నాయని, నిపుణుల కమిటీ దీనికి పరిష్కారం చూపుతుందని చెప్పారు. కమిటీ ఆర్నెల్ల వ్యవధిలో నివేదిక ఇస్తుందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ భవితవ్యంపై సీమాంధ్ర విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైరాం రమేశ్ భరోసా ఇచ్చారు. సీమాంధ్రలో వ్యవసాయ, పెట్రోలియం, కేంద్ర యూనివర్శిటీల స్థాపనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఐఐటీ, ఐఐఎం విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య సౌకర్యాల కల్పనకు ఎయిమ్స్ తరహాలో ఆసుపత్రులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హావిూల మేరకు ప్రణాళికా సంఘం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే నిధులు భరిస్తుందని తెలిపారు. గాలేరు- నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే సీమాంధ్రకు ప్రత్యేక ¬దా దక్కిందని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక ¬దాతో పాటు పదేళ్లు పరిశ్రమలకు పన్ను రాయితీని ఇస్తామని చెప్పారు. ఇందువల్ల వచ్చే పదేళ్లలో సీమాంధ్ర ప్రాంతం రూ.50 వేల కోట్ల మేర లబ్దిపొందుతుందని, అంతకుమించి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించిన రోజు సాయంత్రమే సీమాంధ్ర ఎంపీల కోరిక మేరకు సోనియా.. ప్రధాని మన్మోహన్‌ను కలిసి ప్రత్యేక ¬దా డిమాండ్‌ను ఆయన ముందుంచారని తెలిపారు. బిల్లులో ఆ అంశం చేరిస్తే బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి వచ్చేదని, దీనిని నివారించేందుకే ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారని వెల్లడించారు. విభజన బిల్లు సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించదన్నది అపోహ మాత్రమేనన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెసు తొందరపాటుగా వ్యవహరించిందన్న విమర్శలను జైరాం రమేశ్ కొట్టిపారేశారు. తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. అన్ని పార్టీలు లిఖిత పూర్వకంగా లేఖలు ఇచ్చాయని చెప్పారు.