శృతిమించుతున్న ఈవ్‌టీజింగ్
ఖమ్మం, మార్చి 15 : ఈవ్‌టీజింగ్ భూతం మణుగూరు పట్టణంలో రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ ఈవ్‌టీజింగ్ అనే భూతం మహానగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాలను కూడా పట్టి పీడిస్తోంది. అనేకమంది మహిళలు, విద్యార్థినిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చట్టంలోని లొసుగులు, రాజకీయ ఒత్తిళ్ళు ఉండడంతో ఈ చట్టాలు నీరుగారుతున్నాయనే విషయం రాష్ట్రంలో ఇటీవలచోటు చేసుకున్న కొన్ని సంఘటనల ద్వారా తేలతెల్లమౌతుంది. కాగా, ఈవ్‌టీజింగ్‌కు గురవుతున్న విద్యార్థినిలు కానీ, మహిళలు కానీ విషయాన్ని సంబంధిత పోలీసు శాఖ అధికారులకు తెలుపకపోవడంతో దీనిని నిరోధించే అధికారం ఉన్న పోలీసు సైతం ఈ భూతాన్ని తరిమెయ్యలేకపోతున్నారు. ఇప్పటికే మణుగురు పో లీసులు ఈ ఆకతాయిలపై నిఘా ఉంచారని, కొంతమంది స్థానిక మహిళల నుంచి ఈవ్‌టీజింగ్‌పై ఫిర్యాదులు అందాయని, అయితే చాలామంది మహిళలు, విద్యార్తినులు తాము వేధింపులకు గురవుతున్న ఆకతాయిల భయంతో పోలీసులకు తగు సమాచారం ఇవ్వడం లేదని మణగూరు ఎస్సై తెలిపారు. కానీ మహిళలు, విద్యార్థినిలు ధైర్యంగా ముందుకు వచ్చిన 222033, 9440895329నెంబర్‌లకు తెలియజేయాలని, ఫిర్యాదు చేసినవారి పేరు గోప్యంగా ఉంచుతామని ఎస్సై అన్నారు.