మలేషియా విమాన శకలాల గుర్తింపు?
దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలినట్టుగా అనుమానం
ఘటన స్థలానికి నార్వే ఓడ
కౌలాలంపూర్/ఓస్లో, మార్చి 20 (జనంసాక్షి) :
రెండు వారాల క్రితం బీజింగ్‌కు వె ళ్తూ అదృశ్యమైన మలేషియా ఎయి ర్‌లైన్స్ విమానం ఆచూకీ దాదాపు తెలియవచ్చింది. ఆ విమానానికి సం బంధించినవిగా భావిస్తున్న శకలాలు దక్షిణ హిందూ మహాసముద్రంలో గు ర్తించినట్లుగా ఆస్ట్రేలియా గురు వా రం ప్రకటించింది. ఎంహెచ్- 370 విమాన భాగాలు ఉపగ్రహం ద్వారా గుర్తించామని ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బోట్ వెల్లడించారు. విమా నానికి చెందిన ావిస్తున్న రెం డు భాగాలను ఉపగ్రహం గుర్తించి నట్లు ఆయన వెల్లడించారు. ఆ శక లాలు ఉన్న ప్రాంతానికి ఓ యుద్ధ విమానాన్ని కూడా పంపామని ఆయ న పేర్కొన్నారు. అలాగే మూడు ఎయి ర్‌క్రాఫ్ట్‌లను పంపినట్లు చెప్పారు. అ యితే ఆ ప్రాంతాన్ని గుర్తించడం చా లా కష్టంతో కూడుకున్న పని అని తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన పార్లమెంట్‌లోనూ వెల్లడించారు. మలేషియా ప్రధానికి ఫోన్‌లోనూ సమాచారమిచ్చారు. కనుగొన్న రెండు శకలాల్లో ఒకటి 24 మీటర్లు, మరొకటి ఐదు మీటర్ల పొడవున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ఏపీ-3సి ఓరియన్ అనే ప్రత్యేక విమానం ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. మరికొన్ని విమానాలు కూడా దానిని అనుసరిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలో నీటి ఒత్తిడి, ఆటుపోట్లకు విమాన శకలాలు కొట్టుకుపోయే ప్రమాదముందని, అందుకే ముందుగా వెళ్లిన విమానం శకలాలను గుర్తించగానే వాటి సమీపంలో గుర్తులను లేదా సముద్రంలో తేలే మార్కర్స్‌ను వదులుతాయని అన్నారు.
కాగా విమాన గల్లంతుపై తాము సాగిస్తున్న అన్వేషణకు కీలకమైన దారి దొరికినట్లుగా మలేషియా ప్రకటించింది. మలేషియా రవాణా శాఖ మంత్రి హిషముద్దీన్ గురువారం కౌలాలంపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆస్ట్రేలియా పేర్కొన్న అంశాలను ఆధారం చేసుకొని తమ అన్వేషణ సాగుతుందని వివరించారు. అయితే సముద్రంలో కనిపించిన శకలాలు మలేషియా విమానానివే అని నిర్దారించుకునే వరకూ అన్వేషణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 18 ఓడలు, 29 విమానాలు, 6 హెలికాప్టర్లు విమాన అన్వేషణలో పాల్గొంటున్నట్లు వివరించారు. దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ, మధ్య ఏసియా వరకు రెండు కారిడార్లను అవి అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.
విమాన శకలాలు కనిపించినట్లుగా చెప్తున్న దక్షిణ హిందూ మహాసముద్రంలోని నిర్దేశిత ప్రాంతానికి నార్వేకి చెందిన సెయింట్ పీటర్స్‌బర్గ్ అనే ఓడ చేరుకున్నట్లుగా సమాచారం. కార్లను తరలించే ఈ ఓడ మడగాస్కర్ నుంచి మెల్‌బోర్న్‌కు వెళుతోంది. విమాన శకలాలు కన్పించిన ప్రాంతానికి సమీపంలో ఈ ఓడ ఉండటంతో విమాన అన్వేషణకు సహకరించాల్సిందిగా ఆస్ట్రేలియా అధికారులు ఓడ యజమాన్యాన్ని కోరారు. దీంతో ఓడ తన ప్రయాణ దిశను మార్చుకొని అన్వేషణ ప్రారంభించింది. విమాన అన్వేషణ కోసం ఆస్ట్రేలియా విమానాలు బయల్దేరినా ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో అన్వేషణకు ఆటంకం కలిగినట్లు అధికారులు వెల్లడించారు.