సర్కారు ఏర్పాటులో మేమే కీలకం
ఏ పార్టీతో పొత్తు ఉండదు
మాదే అసలైన సెక్యులర్ పార్టీ : అసద్
హైదరాబాద్, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :
తెలంగాణ సర్కారు ఏర్పాటులో తమ పార్టీ కీలకంగా వ్యవహ రిస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తు లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం అసదుద్దీన్ మాట్లాడు తూ హైదరాబాద్ అభివృద్ధే తమ అజెండా
అని, హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి పెట్టుబడులు వచ్చేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. తమ పార్టీ అసలైన సెక్యులర్ పార్టీగా అభివర్ణించారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులకు భరోసా కల్పిస్తామన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్దపడ్డామన్నారు. తమకు రాజకీయంగా ఎవరితోనూ పొత్తు లేదని ఒవైసీ అన్నారు. తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తాము మేనిఫెస్టో ప్రకటించబోమని, పనులు చేస్తామని చెప్పారు. తమతో పొత్తు పెట్టుకునేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చినా తాము అందుకు సుముఖంగా లేమని తెలిపారు. తాము చేసిన పనులే తమను ఈసారీ గెలిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్ధిగా మూడోసారి ఆయన నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో ‘మా పని.. మా నినాదం’ అనే అంశంతో ప్రజల ముందుకు వెళ్తామని అసదుద్దీన్ తెలిపారు. గత కొన్నేళ్లుగా తాము చేపట్టిన అభివృద్ధే తమ ప్రధాన ఎన్నికల ఆయుధమన్నారు. హైదరాబాద్ అభివద్ధే తమ ఎజెండా అని, హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి పెట్టుబడులు వచ్చేలా కషి చేస్తామని ఓవైసీ చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు హామీ ఇస్తామని, హైదరాబాద్ ఎవరి జాగీరు కాదన్నారు. ఇక్కడ బతికే ప్రతి ఒక్కరిదీ హైదరాబాద్ అని అన్నారు.