టీడీపీ తొలి జాబితా విడుదల
మూడు పార్లమెంట్, 27 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (జనంసాక్షి)
తెలంగాణలో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెల్లడిం చారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీట్లు రానివారు నిరాశ పడొద్దు ఇప్పుడు న్యాయం జరగని వాళ్లను భవిష్యత్తులో ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. మోడీ నా యకత్వాన్ని బలపర్చడం కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. పొత్తులు అర్ధం చేసుకుని ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. 3 లోక్‌సభ.. 27 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశామని తెలిపారు. మంగళవారం పూర్తి జాబితాను వెల్లడిస్తాం. త్వరలోనే సీమాం ధ్ర అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేస్తాం. టీడీపీ తొలి జాబితాలోని వివరా లను ఆయన తెలియజేశారు.
పార్లమెంటు సభ్యులు..
మహబూబాబాద్-మోహన్‌లాల్, ఆదిలా బాద్-రమేష్‌రాధోడ్, జహీరాబాద్-మద న్‌మోహన్,
అసెంబ్లీ అభ్యర్థులు :
సనత్‌న గర్-తలసాని శ్రీనివాస్‌యాదవ్, బాన్సువాడ-బద్యానాయక్, అచ్చంపేట-రాములు, భువనగిరి-ఉమామాధవరెడ్డి, ఇబ్రహింపట్నం-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గ జ్వేల్-గుర్నాధరెడ్డి, బాల్కొండ-ఆలేటి మల్లికార్జునరెడ్డి, సూర్యాపేట-పటేల్ రమే ష్‌రెడ్డి, బోధన్-ప్రకాష్‌రెడ్డి, జగిత్యాల- ఎల్.రమణ, దేవరకొండ-బిల్యానాయక్, మహేశ్వరం-తీగల కృష్ణారెడ్డి, మానకొం డురు-డాక్టర్ సత్యనారాయణ, పెద్దపల్లి-విజయరమణారావు, రాజేంద్రనగర్-టి. ప్రకాష్‌గౌడ్, కూకట్‌పల్లి-మాధవరం కృ ష్ణారావు, తాండూరు-ఎం.నరేష్, చాంద్రా యణగుట్ట-ప్రకాష్‌ముదిరాజ్, మహబూ బాబాద్-బాలూచౌహాన్,
హూజూర్‌నగర్-వంగాల స్వామిగౌడ్, పరకాల-ధర్మారెడ్డి, మిర్యాలగూడ-బి.వెంకటేశ్వర్లు, నారాయణఖేడ్-విజయపాల్‌రెడ్డి, నర్సంపేట-రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంథని-కర్రి నాగయ్య, జహీరాబాద్- సరోత్తమ్.