తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు
డెహ్రాడూన్, మే 4 (జనంసాక్షి) :
ప్రకృతి విళయం సృష్టించడంతో కకావి కలమైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. వేడ పండితుల ప్ర త్యేక పూజల మధ్య ఆదివారం కేదార్‌నాథ్ దేవాలయ ద్వారాలను తెరిచారు. హిమ వత్ పర్వత క్షేత్రం ప్రధాన పూజారి (రావ ల్) భీమ శంకర్ లింగ్ ద్వారాలు తెరుచు కునే కార్యక్రమానికి నాయకత్వం వహించి నట్లు సీఈవో వీడీ సింగ్ మీడియాకు వెళ్ల డించారు. గతేడాది ప్రకృతి సృష్టించిన భా రీ విపత్తుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం
తెలిసిందే. ఆలయాన్ని తొలిరోజున ఎనిమిది మంది విదేశీయులు సహా 1,252 మంది భక్తులు దర్శించుకున్నారు. చార్‌ధామ్ యాత్ర తొలిరోజున తమ అంచనాలకు మించి భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాది జరిగిన విషాదం వల్ల కలిగిన భయం క్రమక్రమంగా తగ్గిపోతుందని వారు పేర్కొన్నారు. మంచుకరగడం ప్రారంభమయ్యాక భక్తులు తండోపతండాలుగా ఇక్కడి విచ్చేస్తారని ఆయన తెలిపారు. కేదార్‌నాథ్ క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా సేవలందిస్తోందని వివరించారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశామని, వారికి కావాల్సినంత ఆహారం అందుబాటులో ఉందని సీఈవో సింగ్ చెప్పారు.