ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధం
పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్లిన సిబ్బంది
పటిష్ట చర్యలు చేపట్టాం : భన్వర్‌లాల్
హైదరాబాద్, మే 6 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు ఈసీ సర్వం సిద్ధం చేసింది. 13 జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ఓటర్ల స్లి ప్‌ల పంపిణీని పట్టణ ప్రాంతాల్లో నూటికి నూరుశాతం పూర్తి చేశా మని తెలిపారు. ఓటర్ స్లిప్‌లు లేక పోయినా ఎన్నికల సంఘం సూ చించిన 11 ఐడీ కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే బా ధ్యత ఓటర్లలేదని అన్నారు. కులం, మలం, వర్గం వంటి వాటి ప్రలో భాలకు గురి కాకుండా మంచి వ్యక్తికి ఎన్నుకోవాలని అన్నారు. వికలాంగులకు, వృద్ధులకు పోలిం గ్ సమయంలో ప్రత్యేక సదుపా యాలు కల్పించామని అన్నారు. మద్యం, నగుదు, ఇతర బహు మవుతుల వాటి ప్రలోభాలకు లొం గ వద్దని అలా జరిగితే వాటిని బాధ్యతులైన వారు, ఇచ్చిన వారు నేరస్థులని అన్నారు. ఓటింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన 1950 ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చునని అన్నారు. ప్రైవేట్, చిన్నిపాటి
సంస్థలకు సెలవు తప్పని సరిగా ఇవ్వాలని అన్నారు. తమ ఆంక్షలను ఎవరైనా నిరాకిస్తే సంస్థపై, ఎలాంటి వ్యక్తిపైనా కఠిన చర్యలు తప్పవని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలలో పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. మొత్తం సీమాంధ్రలో 40,708 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు లక్షా 29వేల మంది పోలీసులను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రలోభాల పర్వం జోరందుకున్నట్టు సమాచారం. ఓటరన్నను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు నజరానాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మద్యం ఏరులై పారుతుండగా, కరెన్సీ కట్టలు తెగుతున్నట్టు సర్వత్రా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకం కావడంతో అధినేతలు వరాలు గుప్పిస్తున్నారు. తొలిసారిగా ఆర్థిక ప్రాతిపదికన కాకుండా కుల ప్రాతిపదికన వరాలు ఇవ్వడం సీమాంధ్ర ఎన్నికల ప్రచార ఘట్టంలో కీలకంగా మారింది. దీంతోపాటు చావోరేవో తేలనున్న ఎన్నికల్లో కులాలను ఆకర్షించేందుకు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. అగ్ర కులాలైన రెడ్డి, కమ్మ, ఇతర కులాలను తమ వైపు ఆకర్షించేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కాపు కలస్థులను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబునాయుడు వారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. ఇటు జగన్, అటు చంద్రబాబునాయుడు ఓట్లు రాల్చే ఏ ఒక్క పథకాన్ని వదలటంలేదు.తాము ప్రకటిస్తున్న పథకాలు ఏమేరకు సాధ్యమన్న విషయాన్ని సైతం వారు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా, సీమాంధ్రలో అయా పార్టీల అగ్రనేతలు సుడిగాలు పర్యటనలు చేసి విస్తృతంగా ప్రచార ఘట్టాన్ని ముగించారు. టీడీపీ బీజేపీ కూటమి తరఫున నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించగా, వైఎస్సార్ సీపీ తరఫున జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్ తదితరులు ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.