కాంగ్రెస్‌ పార్లమెంటరీ పక్షనేతగా సోనియా


న్యూఢిల్లీ, మే 24
(జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పక్షనేతగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఎన్నికయ్యారు. ఇం తకాలం యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె ఇప్పుడు పార్టీ నేతగా వ్యవహరిస్తారు. పార్లమెం ట్‌ సెంట్రల్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా సోనియాను ఎన్నుకు న్నారు. కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే సోనియా పేరు ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు తమ మద్దతు తెలిపారు. ఏకగ్రీవంగా ఆమె పేరును చప్పట్లతో ఆమోదించారు. ఆ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 44 సీట్లతో పేలవమైన ఫలితాలను సాధించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి సోనియా, రాహుల్‌గాంధీ మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో లోక్‌సభలో ప్రతిపక్ష ¬దాను కూడా కాంగ్రెస్‌ కోల్పోయింది. మరోవైపు పార్టీకి తప్ప కూటమికి ప్రతిపక్ష ¬దా ఇవ్వరని తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే కాంగ్రెస్‌ ఎంపీలు గెలిచారు. ఒకరు నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి కాగా మరొకరు నాగర్‌ కర్నూల్‌ నుంచి నంది ఎల్లయ్య గెలిచారు.