ఏపీ స్థానంలో టీఎస్ పెడితే సరి
నంబర్ ప్లేట్ల విషయంలో గందరగోళం వద్దు
శ్రీస్పష్టం చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి) :
తెలంగాణలో మోటార్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు వివాదానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెరదించారు. కొత్తగా నంబర్ ప్లేట్లను మార్చుకోవాలని మంత్రి అనడంతో గందరగోళం చెలరేగింది. వాహన నంబర్ ప్లేట్ల అంశంపై రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సవిూక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో వాహనాల నంబర్లు నంబర్ ప్లేట్లు మార్చాల్సిన అవసరం లేదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాటి స్థానంలో టీఎస్ మార్చుకుంటే సరిపోతుందని కేసీఆర్ తెలిపారు. వాహనాల నంబర్లు పాతవే ఉంటాయని, జిల్లా కోడ్ మాత్రమే మారుతుందని కేసీఆర్ అన్నారు. వాహనాల నెంబర్ ప్లేట్లపై రవాణాశాఖ మంత్రికి సరిగ్గా వివరించలేకపోవడంవల్లే సమస్య వచ్చిందని సమీక్షా సమావేశంలో అధికారులతో కేసీఆర్ అన్నట్టు తెలిసింది. అయితే దీనితో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పైసా ఖర్చు లేకుండా చూడాలని అన్నట్లుగా తెలుస్తోంది.
గా దిక్కుమాలిన ఆర్డినెన్స్ చంద్రబాబు పుణ్యమే పధానిపై ఢిల్లీ పర్యటనలో బాబు ఒత్తిడి