80పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: లోహ, మూలదనవస్తువులు, వాహన రంగాలకు చెందిన షేర్లకు ఆదరణ లభించడంతో మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 79.71పాయింట్ల లాభంతో 17185.01వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 23.45పాయింట్ల ఆధిక్యంతో 5216.30వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్క్రిప్‌లలో 21లాభాలనార్జించాయి. బజాజ్‌ ఆటో, టాటా పవర్‌, జిందాల్‌స్టీల్‌.. తదితర కంపెనీల షేర్లు రాణించాయి. రాష్ట్రపతి ఎన్నికల తరువాత భారత్‌లో ఆర్థిక సంస్కరణలు వేగంపుంజుకుంటాయనే అమెరికా పెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ బెన్‌ వ్యాఖ్యలు మార్కెట్‌ లాభపడేందుకు దోహదం చేశాయి.