వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన తెలుగుతేజం

 Untitled-1
గ్లాస్గో, జులై 28 : తెలుగు తేజం, ఒరిస్సాకు చెందిన కత్తుల రవికుమార్‌ రజత పతకం గెల్చుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన 77 కిలోల విభాగం ఫైనల్లో రవికుమార్‌ మొత్తం 317 (142+175) కిలోల బరువెత్తి వెండి పతకాన్ని అందుకున్నాడు.

తమిళనాడుకు చెందిన సతీష్‌ శివలింగం 328 కిలోలతో (149+179) స్వర్ణం గెల్చుకుని కామన్వెల్త్‌ రికార్డు బద్దలుకొట్టాడు. ఆస్ర్టేలియాకు చెందిన ఇటౌండికి (314) కాంస్యం దక్కింది.