హైదరాబాద్‌ వారసత్వాన్ని కొనసాగించండి

ccc

సీఎం కేసీఆర్‌తో 8వ నిజాం సతీమణి ఇస్రా భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : హైదరాబాద్‌ వారసత్వాన్ని కొనసాగించాలని 8వ నిజాం సతీమణి ఇస్రా అభిప్రాయడ్డారు. ఈమేరకు ఆమె శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా ఇస్రాను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమె అభినందించారు. ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడం, చారిత్రక, వారసత్వ వైభవాలను పునరుద్ధరించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె అన్నారు. చారిత్రక కట్టడాలను కాపాడడంలో ప్రభుత్వం మంచి కృషిచేస్తోందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేందకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు