మన యాదగిరికి మహర్దశ
గుట్టకు స్వయం ప్రతిపత్తి, స్వర్ణగోపురం
2వేల ఎకరాల్లో కాటేజీలు, కళ్యాణ మంటపాలు
500 ఎకరాల్లో అటవీ విస్తరణ
సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 17 (జనంసాక్షి) : యాదగిరి గుట్టపై ముఖ్య మంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. దీంతో గుట్టకు మహర్దశ రానుం ది. గుట్టకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, స్వర్ణగోపురం ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. శుక్రవారం ఆయన స్వామివారిని దర్శించు కున్నారు. 2వేల ఎకరాల్లో కాటేజీలు నిర్మిస్తామని, కళ్యాణ మంటపాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. 500 ఎకరాల్లో అడవుల పెంపకం చేపడు తామన్నారు. తిరుమల తరహాలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట రానున్న రెండుమూడేళ్లో అభివృద్ది చెందనుంది. ఆలయ విస్తరణ, అభివృద్ది పనులకు అవసరమైన నిధులను విడుదలచేసి దీనిని మహా పుణ్యక్షేత్రంగా తయారుచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆలయంలో ఆయన వేదోక్తంగా పూర్ణకుంభస్వాగతం పలికి దర్శనం చేయించారు. పండి తులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం సిఎం కెసిఆర్ విూడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో యాదగిరిగుట్ట నిర్లక్ష్యా నికి గురయ్యిందన్నారు. ఆలయ గర్భగుడి ఇరుకుగా ఉందని దానిని స్థపతు లతో పరిశీలింపచేసి విస్తరిస్తామని అన్నారు. గర్భగుడి విస్తరణతో పాటు స్వా మివారి ఆలయానికి స్వర్ణగోపురం కట్టిస్తామని అన్నారు. అంతేగాకుండా టిటిడి తరహాలో గుట్టకు స్వయంప్రతిపత్తి ఇస్తామని ప్రకటించారు. అలాగే స్వామివారి గర్భగుడి ఎత్తు పెంచుతామన్నారు. అడ్డదిడ్డంగా కట్టడాలు రావ డంతో గుడి లోపలికి అయ్యిదంన్నారు. గతంలో రైలులో వెలితే రాయగిరి నుంచి గుట్ట స్పష్టంగా కనిపించలేదన్నారు. గుట్టపై తిరుమల తరహాలో కాటే జీలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్మిస్తామన్నారు. గుట్టకు వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గుడి పరిసరాల్లో పరిశుభ్రత పెంచాలని అధికా రులను ఆదేశించారు. మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని, యాదగిరి గుట్టను భవిష్యత్తులో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుట్ట అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఇక్కడ మంచినీటి కోసం తవరలో ఏర్పాటుచేసే గ్రిడ్ నుంచి నిరం తరంగా నీటిని సరఫరా చేస్తామని అన్నారు. ఇక్కడ కనీంస 500 ఎకరాల్లో అడవిని పెంచి జింకల పార్కును అభివృద్ది చేస్తమాన్నారు. అలాగే 2 వేల ఎకరాల్లో విస్తరించే విధంగా కాటేజీలు, కళ్యాణమండపాలు, పార్కులు అబి óవృద్ది చేస్తామన్నారు. ఈ రకంగా గుట్టను భవిష్యత్‌లో అద్భుతంగా తీర్చిది ద్దుతామని స్పష్టం చేశారు. కార్పోరేట్ సంస్థల సహకారంతో గుడి నిర్మా ణాన్ని అద్భుతంగా నిర్మించి తీరుతామన్నారు. గుడి పరిసరాల్లో పందులు ల ేకుండా చూడాలని సూచించారు. రాబోయే రోజుల్లో భక్తులకు అనేక సౌక ర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యాదగిరిగుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తామని, రెండేళ్లలో దీన్ని పూర్తిగా టీటీడీ తరహాలో టెంపుల్ సిటీ గా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రాం తంలో శుక్రవారం నాడు ఏరియల్ సర్వే చేసిన కేసీఆర్.. యాదగిరిగుట్టపై వరాలజల్లు కురిపించారు. రెండువేల ఎకరాల్లో తిరుమల తిరుపతి తరహాలో ఉద్యానవనాలు, కళ్యాణమండపాలు, కాటేజిలు ఏర్పాటు చేస్తామన్నారు. గుట్ట కింద చెరువులు, గుట్టలు కలిపి 400 ఎకరాల్లో అభయారణ్యం ఏర్పా టు చేయిస్తామని తెలిపారు. యాదగిరిగుట్టలో వేద పాఠశాల ఏర్పాటు చేసా ్తమని, ఇక్కడ జరిగే బ్ర¬్మత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమ ర్పించేలా ఆనవాయితీ ఇకవిూదట ఉంటుందని చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వా రా మంచినీరు ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని కార్పొ రేట్ సంస్థలన్నీ ఆర్థిక సహకారం అందించాలని కోరుతామని అన్నారు. అలాగే ఇక్కడి పార్ట్‌టైమ్ ఉద్యోగులన సర్వీసులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చేరుకున్న ఆయన యదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ సా ధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఈ ఏరియల్ సర్వే చేశారు. తిరుపతికి దీటుగా సుమారు రూ.700కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధికి అవసరమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఏరియల్ సర్వేలో ఎం పీ డాక్టర్ బుర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గొంగిడ సునీత, కలెక్టర్ చిరంజీవులు పాల్గొన్నారు. ఏరియల్ సర్వే అనంతరం యాదగిరిగుట్టలోని హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కొండపైకి చేరుకుంటారు. స్వామివారిని ద ర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్లొన్నారు. కాగా యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి కేసీఆర్‌కు అత్యంత ఇష్టదైవం. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామివారిని దర్శించుకోవటానికి ఆయన ప్రయత్నించినప్పటికీ పలు కారణాలతో రాలేకపోయారు. ఆయనవిూద భక్తితోనే దూరదర్శన్ ఛానల్‌కు యాదగిరి అని నామకరణం చేయించారు. ఈ విషయాన్ని సిఎం స్వయంగా వెల్లడించారు.