9 మంది ఎక్సైజ్‌ సీఐల బదిలీ

శ్రీకాకుళం, జూలై 15 :
జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పరిధిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులకు బదిలీలు జరిగాయి. రాష్ట్ర కమిషనర్‌ సమీర్‌శర్మ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం టాస్క్‌ఫో ర్స్‌గా ఉన్న రాఘవయ్యను ఎన్‌ఫోర్స్‌మెంటుకు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ రాజశేఖరనాయుడు పలాస సర్కిల్‌ కు బదిలీ చేశారు. పలాసలో ఉన్న సింహాచలంను విజయనగరం జిల్లా తెర్లాంకు, పొందూరు సీఐగా ఉన్న సుధాకర్‌ను శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్‌కు, విశాఖపట్నంలో డిస్టిబ్యూటరీ వింగ్‌లో ఉన్న రాజారావు పా లకొండకు బదిలీ చేశారు. పాలకొండ సీఐ శ్రీనివాసరావును కోటబొమ్మాలికి , అక్కడ ఉన్న పాపారా వును విశాఖపట్నం జిల్లా అరకు సర్కిల్‌కు, పలాస టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న చలపతిరావును పొందూరుకు, పార్వతీపురం నుంచి విజయకుమార్‌ను శ్రీకాకుళం బదిలీ చేశారు.