నెరవేరిన 30 సంవత్సరాల స్వంతింటి కల..

 

 

 

 

 

 

*ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎంపీడీవో రాజేందర్, తాసిల్దార్ మారుతి రెడ్డి, సర్పంచ్ మల్లు గారి పద్మ..

గంభీరావుపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి);

గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన సొంత ఇల్లు లేక చాలామంది నాన అవస్థలు పడుతూ కాలం వెళ్లదీసినారని ఒక్క ఇల్లు కూడా గత ప్రభుత్వ హయాం లో మంజూరు కాలేదని సర్పంచ్ మల్లు గారి పద్మఅన్నారు , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, ఎంపీడీవో రాజేందర్, తాసిల్దార్ మారుతి రెడ్డి,గ్రామ సర్పంచ్ మల్లు గారి పద్మ నర్సా గౌడ్, బుధవారం రోజున గంభీరావుపేట మండల కేంద్రంలోని దోషాలగూడెం చెందిన, టేకుమల్ల నాగలక్ష్మి, గాదం రేణుక, లబ్ధిదారులతో కలుపుకొని ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం లో చేశారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపిన సారే చీరే లను సర్పంచ్ చేతులమీదుగా, అందించారు, అనంతరం ఎంపీడీవో రాజేంద్ర మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్ళదేశారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరై సంవత్సరంలోపే నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశం చేయడము హర్షినియమన్నారు,
తాసిల్దార్ మారుతి రెడ్డి మాట్లాడుతూ, పేదింటి వారికి నెరవేరిన కళ అని, తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, హమీద్, మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సాగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మల్యాల రాజ్వీర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు, వేషాల వెంకటి, లక్కం నాంపల్లి, మార్కెట్ డైరెక్టర్లు, కోట లింగం, ఎడవైన ప్రభాకర్,సీనియర్ నాయకులు అక్క పెళ్లి బాలయ్య, నిశాంత్,సోషల్ మీడియా రాజశేఖర్, శంకర్, తదితరులు పాల్గొన్నారు