మాడుగులపల్లిలో తప్పిన పెను ప్రమాదం డివైడర్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు

మాడుగులపల్లి, ఏప్రిల్ 16( జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది తమిళనాడులోని అరుణాచలం నుండి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు, అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి దూసుకెళ్లిందిప్రమాద సమయంలో బస్సులో ముగ్గురు చిన్న పిల్లలతో సహా మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది బస్సు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొనడంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ప్రయాణికులను మరో వాహనంలో హైదరాబాద్‌కు పంపించే ఏర్పాట్లు చేశారు. హైవేపై నిలిచిపోయిన బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు

తాజావార్తలు