రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మంగపేట నవంబర్ 13(జనంసాక్షి)
ఇసుకలల లారీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి
ఇసుక లారీ ఢీ కొట్టడంతో దుర్గం బాలకృష్ణ (35) అనే యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కమలాపురం ఆటో స్టాండ్ సమీపంలోనీ ఫాతిమా చికెన్ సెంటర్ వద్ద సాయంత్రం 6 గంటలకు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలకృష్ణ రోజువారి పనులలో భాగంగానే తాను కమలాపురం శివారులోని కవ్వాలకుంట వద్ద నుండి పొలం పనులు ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో మండలంలోని వాడగూడెం, చుంచుపల్లి, మల్లూరు ఇసుక క్వారీల నుంచి ఇసుకను తీసుకెళ్తున్న గుర్తు తెలియని లారీ అతి వేగంతో బాలకృష్ణను ఒక్కసారిగా డీ కొట్టడంతో ఎడమ చేయి, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడిని అక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.



