“ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ 1,5,6 అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ కొమ్ము రవి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో అన్నప్రసాన అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణి స్త్రీలు కిషోర బాలికలకు ఒకపూట సంపూర్ణ భోజనంపై అంగన్వాడి సేవలను అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారని, స్టోర్ రూమ్ ఏడబ్ల్యూసీ కి హామీ ఇచ్చారు. న్యూట్రి గార్డెన్ ఏర్పాటుకు తన వంతు సహాయం చేస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొయ్యడ సందీప్జ్ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం నాగిల్ల శ్యాంసుందర్ రెడ్డి, సీఆర్పి కనకరాజు, వార్డు మెంబర్ భాస్కర్, డాక్టర్ అనిల్, అంగన్వాడీ టీచర్లు, ఆయా, ఆశా లు పాల్గొన్నారు.


