అంబర్‌పేట్ మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు

అంబర్‌పేట్ ఏప్రిల్ 16 ( జనం సాక్షి ):అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెట్ డెన్ మీసేవ కేంద్రంపై సాయంత్రం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న తనిఖీలలో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.సోదాల సందర్భంగా కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్ల ఫోన్లు, కంప్యూటర్లు, అలాగే వినియోగదారుల అప్లికేషన్ ఫారమ్‌లను అధికారులు పరిశీలించారు. ఏవైనా అవకతవకలు ఉన్నాయా అన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. అక్రమాలు గుర్తించిన పక్షంలో పై అధికారులకు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు.ఇక మీసేవ కేంద్రం యజమాని జయంతిని ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఈ దాడులతో అంబర్‌పేట్ ప్రాంతంలో కలకలం రేగింది.

తాజావార్తలు