రోడ్డు భద్రత నియమాలపై అవగాహన లోపం వల్లే ప్రమాదాలు

ఏసిపి వసుంధర యాదవ్
పెనుబల్లి, ఫిబ్రవరి, 27(జనం సాక్షి )
రోడ్డు భద్రత నియమాలపైన అవగాహన లోపం వల్ల రోడ్డు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. పెనుబల్లి మండలం వియం బంజర్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్ కె ఫంక్షన్ హాల్ లొ అరైవ్ అలైవ్ రెండోవ విడత కార్యక్రమంలో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. సురక్షిత ప్రయాణం సంతోషకర గమ్యం అనే లక్ష్యంతో అందరూ కలిసి పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడుపుతూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో సత్తుపల్లి రూరల్ సీఐ మత్తులింగం, వీయం బంజర్ ఎస్ ఐ వెంకటేష్,కల్లూరు ఎస్ ఐహరిత వేంసూర్ ఎస్ ఐ కవిత, పాల్గొన్నారు.



