మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఆదివరాహ దేవస్థానం చైర్మన్ ముస్త్యాల దామోదర్

మంథని, ( జనంసాక్షి ): పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ ఆదివరాహ దేవస్థానం నూతన చైర్మన్ గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముస్త్యాల దామోదర్ శనివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, స్వీట్ తినిపించి ఆత్మీయ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సైతం చైర్మన్ దామోదర్ కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివరాహ దేవస్థానం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని.. దేవస్థానానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా పాలకవర్గం పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ ముస్త్యాల దామోదర్ కు సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఇనగంటి చిన్నారావు, ఇనగంటి రామారావు, పిట్ల గోపాల్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు