సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

 

 

 

 

 

 

గోడ పత్రికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు

భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా దేశ్‌ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మంగళవారం అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు కలెక్టరేట్ కార్యాలయంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కే. శ్రీలత, అధ్యాపక బృందంతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ఆర్మీ అధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్న ఈ కళాశాల సేవలను ప్రశంసించారు. క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు ఆర్మీ శిక్షణ లభించడం విద్యార్థినులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డా. కే. శ్రీలత మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీతో పాటు ఆర్మీ ట్రైనింగ్, యూపీఎస్సీ కోచింగ్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించబడుతుందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఏప్రిల్ 20 నుండి 30 వరకు స్వీకరించబడతాయని, సెలక్షన్స్ మే 1 నుండి 6 వరకు నిర్వహించబడతాయని తెలిపారు.