ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 14:(జనం సాక్షి)ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శవంతమైన మహనీయుడని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల అసోసియేషన్ అధ్యక్షులు అర్గుల చిన్నయ్య అన్నారు. జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయంలో ప్రిన్సిపాల్ ల సంఘం తరఫున అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ మాత్రం సాంకేతిక అభివృద్ధి లేని సమయంలోనే అంబేద్కర్ భవిష్యత్తు ఊహించారని అన్నారు. తాను చదివిన ఉన్నత చదువులు ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడేలా బావిభారత పౌరులను తీర్చిదిద్దేందుకు రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. ప్రపంచానికే అంబేద్కర్ ఆదర్శనీయమని అన్నారు.ప్రిన్సిపాల్ సంఘం ఉపాధ్యక్షులు గంధం బుద్దిరాజు మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం ఆటంకాలతో ప్రారంభమై అత్యున్నత స్థాయికి ఎదిగే విధంగా ఆయన చదువులే కారణమని అన్నారు. ప్రస్తుత సమాజంలో అణగారిన వర్గాలవారు విద్య ద్వారానే గుర్తింపు లభిస్తుందని, కావున అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన కల్పించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, రజియుద్ధిన్న్ అస్లాం, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.రాజేష్, ప్రధాన కార్యదర్శి పర్షరాములు, టి జి జే ఎల్ అధ్యక్షులు బి.భాస్కర్ టి.జి.జె ఎల్.ఏ.కోశాధికారి ప్రవీణ్, వొకేషనల్ అధ్యాపకుల సంఘం నుండి వై.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


