చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా అందె అశోక్

చేర్యాల (జనంసాక్షి) మార్చి 17 :చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన అందే అశోక్ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం జేఏసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం గత 10 సంవత్సరాలుగా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక ఉద్యమాలలో కీలకపాత్ర పోషించినందుకు గాను నియమించినట్లు జేఏసీ చైర్మన్ డాక్టర్ ఆర్. పరమేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆకాంక్షను నెరవేర్చే ఉద్యమంలో భాగంగా గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.