గంభీరావుపేటలో అయ్యప్ప స్వాముల ర్యాలీ

గంభీరావుపేట జనవరి 01(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజు ఆంజనేయ టెంపుల్ నుండి అయ్యప్ప స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ ఊరు వీధుల గుండా తిరుగుతూ డబ్బు చప్పులతో డీజే సౌండ్ తో ర్యాలీ నిర్వహించారు, స్వాములు మాట్లాడుతూ_ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంట బాగుండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కన్య స్వాములు పాల్గొన్నారు.


