బండారు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి

 

 

 

 

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి.

బూర్గంపహాడ్ మార్చి 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- సీపీఎం మాజీ మండల కార్యదర్శి, సీనియర్ నాయకులు అమరజీవి బండారు వెంకటేశ్వర్లు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నకిరిపేట గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకులు బండారు వెంకటేశ్వర్లు ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తో కలిసి స్థూపం వద్ద జెండా ఆవిష్కరించి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి సేవలను కొనియాడారు. బండారు తాను చేసిన ప్రజా ఉద్యమాలు, ప్రజాపోరాటాలు సీపీఎంకు అంకితభావంతో పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాథం, గుంటక కృష్ణ, దామోదర్ రెడ్డి, శ్యామల అజయ్ కుమార్, బుర్రా వెంకన్న, బోళ్ల శ్రీశైలం, కందుకూరు నాగేశ్వరరావు, బండారు రాకేష్, పుల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మినారాయణ, ఎంఎల్ పార్టీ నాయకులు జక్కుల రాంబాబు, పాండవుల ఉపేందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు