సుధా నగర్‌లో మజ్జిగ పంపిణీ.
మల్కాజిగిరి ఏప్రిల్ 21(జనంసాక్షి)
మౌలాలి సర్కిల్ పరిధిలోని సుధా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద సోమవారం అక్షయ తృతీయ పురస్కరించుకుని మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా స్థానిక నివాసితులు స్వరూప్, వాత్సల్య, వెంకటేశ్వరరావు,శ్రావణి తమ స్వంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు కాలినడకన వెళ్లే పాదచారులకు, వాహనదారులకు చల్లని మజ్జిగ తోపాటు మంచినీటిని పంపిణీ చేసి దాహార్తిని తీర్చారు. వేసవిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అప్పారావు, కిరణ్ స్థానికులు పాల్గొన్నారు.



