పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13:(జనం సాక్షి)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి ఎస్ సిబ్బంది ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కెట్, తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో ఇట్టి పేకాట స్థావరం పై రైడ్ చేసి 6గురు పేకాట రాయుళ్ళు మరియు వాహనాలు 3కార్ లు మరియు 6సెల్ ఫోన్ లు ,నగదు1,17940/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించడం జరిగిందని తెలిపారు.


