ఇద్దరు ఎస్ఐ లపై చీటింగ్ కేసు నమోదు

 

 

 

 

 

 

మహిళను నమ్మించి రూ.1.82 కోట్లు వసూలు చేసిన ఇద్దరు ఎస్సైలు.

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 23 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- వ్యాపార నిమిత్తం డబ్బు తీసుకుని కమీషన్ ఇస్తామని అసలు కూడా ఎగొట్టినందుకు ఇద్దరు ఎస్ఐ లు వారి తండ్రి పై బూర్గంపహాడ్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బూర్గంపహాడ్ మండలం సారపాకకు చెందిన భూక్యా కుమారి అనే మహిళ నుంచి 2023 జూన్లో భద్రాచలంలో గతంలో ఎస్సైలుగా పనిచేసిన ఖమ్మం ప్రాంతానికి చెందిన మహేష్, రాణాప్రతాప్ లతో పాటు తండ్రి చంద్రం లు రూ.1.82 కోట్లు వ్యాపారం కోసం తీసుకున్నారు. వ్యాపారం కోసమని, కమీషన్ 35శాతం ఇస్తామని నమ్మబలికి, తీసుకున్న నగదు ఇవ్వకుండా మోసం చేశారని బాధిత మహిళ సోమవారం బూర్గంపహాడ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై నాగభిక్షం ఆ ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో భద్రాచలం, చుంచుపల్లి, జూలూరుపాడు తదితర పోలీసుస్టేషన్లలో వీరు ఎస్సైలుగా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. కాగా కొద్దినెలల కిందట రాణాప్రతాప్ భార్య ఆత్మహత్య చేసుకోగా.. రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేశ్ పై కేసు నమోదవడంతో జెలుకు వెళ్ళి వచ్చారు.