చదరంగం క్రీడాకారిణి కుమారి బోగోజు దేవికకు సన్మానం

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఫిబ్రవరి 19 (జనం సాక్షి)ఫిబ్రవరి 23 నుండి 28 వరకు విశాఖపట్నంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చదరంగం పోటీలకు 42వ డివిజన్ రంగసాపేటకు ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి బోగోజు శ్రావణ్ రాజశ్రీ దంపుతుల కుమార్తె కుమారి బోగోజు దేవిక ఎన్నికైన సందర్భంగా రంగసాయిపేట ప్రముఖ సామాజికవేత్త బిజెపి రాష్ట్ర నాయకులు కొల్లూరి యోగానంద్ ఆధ్వర్యంలో కొల్లూరి రుషి నంద ట్రస్టు ద్వారా చదరంగంలో సత్తా చాటిన కుమారి దేవికను ట్రస్ట్ చైర్మన్ కొల్లూరి యోగానంద్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొల్లూరి యోగానంద్ మాట్లాడుతూ కుమారి దేవిక ఇంకా మరి ఎన్నో శిఖరాలను అధిరోహించి రంగసాయిపేట తోపాటు వరంగల్, తెలంగాణ రాష్ట్రo భారతదేశ ఖ్యాతిని తన ప్రతిభతో సత్తా చాటాలని కుమారి దేవిక తో పాటు దేవికకు శిక్షణ అందిస్తున్న గురువైన ఫిజికల్ డైరెక్టర్ గోగు నారాయణకు అభినందనలు తెలియజేశారు. బోగోజు దేవిక నివాసం ఉంటున్న సహచర కాంప్లెక్స్ మహిళలు దేవికను సన్మానించారు. ఈ సందర్భంగా యోగానందు దేవికకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో దేవిక తల్లిదండ్రులు బోగోజు శ్రావణ్ రాజశ్రీ తో పాటు కాంప్లెక్స్ నివాసముంటున్న సహచర మహిళలు ముసినపెల్లి జమున, సిటీ సరితా, దండు చైతన్య, మంద శైలజ ఉడ్డనూరి రజిత తదితరులు పాల్గొన్నారు.