ఘనంగా చింతల జన్మదిన వేడుకలు

భువనగిరి, ఫిబ్రవరి 23(జనంసాక్షి)బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతల యువసేన, అభిమానుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వెంకటేశ్వర రెడ్డి అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులో ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వలపు విజయ్, దండబోయిన బలరాజ్ యాదవ్, గాజుల నవీన్, పల్లెపాటి రవికుమార్, ఎలిమినేటి మహేంద్ర రెడ్డి, దోషపాటి హరీష్, కూదే శ్రీశైలం, మోతే మనోహర్, నాగారం నరేష్ మరియు చింతల యువసేన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



