జల్లి గ్రామంలో ఘర్షణ

ఒకరి పై దాడి… పరిస్థితి విషమం..
చెన్నారావుపేట, ఫిబ్రవరి 24 ( జనం సాక్షి): మండలంలోని జల్లి గ్రామంలో ఘర్షణ జరిగిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… ఇదే గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి వద్ద శుభకార్యం జరుగుతుంది. శుభకార్యంకు వెళ్లే ముందు మద్యం త్రాగే విషయంలో ఇదే గ్రామానికి చెందిన మంచాల సురేష్, దొంతర బోయిన కొమ్మాలు ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో మంచాల సురేష్ ను దొంతరబోయిన కొమ్మాలు, అతని కుమారులు రాజేందర్, నరేష్ లు ముగ్గురు కలిసి కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మంచాల సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఎంజిఎంకు తరలించారు. ప్రస్తుతం సురేష్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నారు.



