5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

 

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బాత్క శంకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు భారత లవకుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, బాత్క శంకర్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.