వరంగల్‌లో క్రికెట్ సంబరం

20 నుంచి జయచందర్ ఆల్ స్టార్స్ ట్రోఫీ

ఖమ్మం , ఏప్రిల్ 20, (జనంసాక్షి) : తెలంగాణ క్రికెట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక పోటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న “జయచందర్ ఆల్ స్టార్స్ సమ్మర్ క్రికెట్ లీగ్” ఈ నెల 20 నుంచి వరంగల్ వేదికగా ఘనంగా ప్రారంభం కానుంది. యువ ప్రతిభకు వేదికగా నిలుస్తున్న ఈ టోర్నమెంట్ తొలి విడతలో ఆరు జిల్లాల జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. కాకతీయ కింగ్స్, మెదక్ మాస్టర్స్, రంగారెడ్డి రేంజర్స్, ఆదిలాబాద్ ఆరోస్, పాలమూరు ఫైటర్స్, ఖమ్మం లయన్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. వరంగల్ మైదానాలు క్రికెట్ జోష్‌తో కళకళలాడనున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ప్రతిభావంతులైన క్రీడాకారులతో ఖమ్మం లయన్స్ జట్టు పటిష్టంగా సిద్ధమైంది. అనుభవజ్ఞుడైన ఇమ్రాన్ షేక్ కెప్టెన్‌గా జట్టును నడిపించనుండగా, ఎం. పవన్, సూర్య (కేసీపీ), కరుణాకర్, వరప్రసాద్, సాల్మన్ కీలక పాత్ర పోషించనున్నారు. సూర్యాపేట నుంచి శివచరణ్, ప్రవీణ్, మణికంఠ; మహబూబాబాద్ నుంచి గణేష్, జంషీద్; భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఆర్యన్, రిత్విక్, జీవన్, హ్రిషికేశ్, ఉజ్వల్ గణేష్ జట్టుకు బలంగా నిలుస్తున్నారు. జట్టుకు కోచ్‌గా జి. వీరేష్ గౌడ్, సహాయ కోచ్‌గా సుధాకర్, మేనేజర్‌గా జాకీర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ , జనరల్ సెక్రెటరీ జి. వీరేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ నరాల నరేష్, జాయింట్ సెక్రెటరీ వి.డి.ఐ రాజీవ్ రాజ్, కోశాధికారి వీర్ల రవి తదితరులు జట్టుకు అభినందనలు తెలుపుతూ, టోర్నమెంట్‌లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఖమ్మం లయన్స్ క్రీడాకారులకు “యువం” సంస్థ తరఫున డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ డ్రెస్‌లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాజావార్తలు