d: హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి:-(అలుగు రమేష్)
ప్రభుత్వ పాఠశాలను విస్మరిస్తున్న ప్రభుత్వం.
యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు22:-
హనుమకొండ జిల్లా లో సోమవారం రోజున భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హనుమకొండ పట్టణంలో స్థానిక ప్రాక్టీసింగ్ పాఠశాలను సందర్శించడం జరిగింది. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను పూర్తి గా విస్మరిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కనీసం మధ్యాహ్న భోజనానికి పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం త్రాగునీరు మూత్రశాలలు డైనింగ్ హాలు కనీస అవసరాలు తీర్చకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం హామీలు మాత్రమే కోడలు దాటుతున్నాయని ఆచరణ మాత్రం గడప దాటలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దామన్న ప్రభుత్వం నేటి వరకు వాటి ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కొరకై ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఇంచార్జి పాలకూరి హరీష్ శ్రీనాథ్ నిఖిల్ సాయి తేజ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.