కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, జనవరి 4 (జనం సాక్షి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 1వ, 2వ, 3వ వార్డులలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు,సన్నబియ్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇంటి స్థలం లేనివారికి త్వరలో స్థలాలు, చేనేతలకు లక్ష రూపాయల రుణమాఫీ చేశామని అన్నారు.
పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి తడక వెంకటేశ్వర్లు, అభ్యర్థులు కొండమడుగు ఎల్లస్వామి, గుండ్ల నవనీత, రావుల జంగయ్య, నల్ల నాగేశ్వర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భారత లవ కుమార్, మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, తడక రమేష్, మర్రి నరసింహారెడ్డి, బండారు ప్రకాశ్ రెడ్డి, దారెడ్డి వేణుగోపాల్ రెడ్డి, నార్లకంటి రాంరెడ్డి, ఇటమోని మహేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


