అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ

భీమదేవరపల్లి:ఏప్రిల్ 14(జనం సాక్షి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని వంగర గ్రామంలో ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ హాజరై రైతులకు షూస్ అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు పొలాల్లో పని చేసే సమయంలో పాములు,తేళ్లు వంటి విషజంతువుల నుంచి రక్షణ కోసం ఇలాంటి షూస్ ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
అనంతరం ఉపాధి హామీ పథకం కింద చెరువుల నల్ల మట్టి రైతుల పొలాలకు తరలింపు పనులను ఆమె ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రశాంతి, కీటక శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి,బీసీఐ అసిస్టెంట్ మేనేజర్ రామారావు,క్షేత్ర సిబ్బంది రఘు, తిరుపతి,సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.రైతులు ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృషి విజ్ఞాన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.


