నేడే కవిత కొత్త పార్టీ తరలి వెళ్లిన జిల్లా మండల నాయకులు
గంభీరావుపేట ఏప్రిల్ 25(జనం సాక్షి); నేడే రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కరం కానుంది గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠగా తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఆవిర్భావం కాబోతున్న సందర్భంగా మేడ్చల్ జిల్లా అద్వయ కన్వెన్షన్ ముషీరాబాద్ లో ప్రకటించబోతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నుండి జాగృతి నాయకులు కూర సురేష్ పటేల్ ఆధ్వర్యంలో శనివారం రోజు ముషీరాబాద్ సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నుండి భారీ ఎత్తున బయలుదేరారు, ఈ సందర్భంగా కూర సురేష్ మాట్లాడుతూ ముషీరాబాద్ లో జరగబోయే సభకు పెద్ద మొత్తంలో 33 జిల్లాల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా లో, అన్ని వర్గాల ప్రజలకు మహిళలు, స్వచ్ఛందంగా తరలివస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తెలంగాణలో జాగృతి నాయకురాలు ప్రశ్నించు”పోరాడు”పరిష్కరించు”అనే నిదానంతో వెళుతున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీగా ఎదుగుతున్న తరుణంలో అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.



