చేవెల్లో ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

చేవెళ్ల,జూలై 01 (జనంసాక్షి) బస్సు కోసం వేచి చూస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని షాబాద్ చౌరస్తాలో చోటు చేసుకుంది. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఈ రోజు ఉదయం షాబాద్ చౌరస్తా వద్ద బస్సు కోసం విద్యార్థి సాత్విక్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి అనే విద్యార్థి బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఆ క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కందవాడ వార్డుకు చెందిన శేరి క్రిష్ణా రెడ్డి తనయుడని గుర్తించారు. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు.



