సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ – మొక్క నాటిన సీపీ సాయి చైతన్య

సిరికొండ, జూన్ 30 (జనం సాక్షి ) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. తనిఖీ అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో కమిషనర్ మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తనిఖీలో భాగంగా స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు, కేసుల నమోదు మరియు దర్యాప్తు పురోగతి, ఎఫ్‌ఐఆర్‌లు, కోర్టు కేసుల స్థితి, డ్యూటీ రోస్టర్, స్టేషన్ రికార్డులు, సీసీటీవీ వ్యవస్థ, శాంతిభద్రతల నిర్వహణపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. అలాగే పెండింగ్ కేసుల వివరాలు, వాటి పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు.
పోలీసు సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కార విధానం, అత్యవసర స్పందన వ్యవస్థపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సీఐ బిక్షపతి, సిరికొండ ఎస్‌ఐ రామకృష్ణ, దర్పల్లి ఎస్‌ఐతో పాటు ఏసీపీ పాల్గొన్నారు.
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు.

తాజావార్తలు