దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్

సంగారెడ్డి, ఏప్రిల్ 03( జనం సాక్షి)

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తి చిరస్మరణీయమని మునిపల్లి మాజీ జెడ్పిటిసి పైతాల మీనాక్షి సాయికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల దొడ్డి కొమురయ్య విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగానికి దొడ్డి కొమరయ్య చేసిన సేవలు మరవలేనివని అన్నారు.
ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.