దళారులను నమ్మి మోసపోవద్దు: టౌన్ ప్లానింగ్ అధికారి బాల శ్రీనివాస్

 

 

 

 

 

 

 

 

మల్కాజిగిరి,నవంబర్14(జనంసాక్షి)
సర్కిల్ పరిధిలో అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టే వారు నిబంధనల ప్రకారం మాత్రమే నిర్మాణాలు పూర్తి చేయాలని డిప్యూటీ సిటీ ప్లానర్ బాల శ్రీనివాస్ హెచ్చరించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ భవనాలు, అదనపు ఫ్లోర్లు,గోదాములు,సెల్లార్లు, పెంట్ హౌస్ నిర్మాణాలను నిబంధనలకు విరుద్ధంగా చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకొని నిర్ధాక్షిణ్యంగా కుల్చివేస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా దళారులు వచ్చి మున్సిపల్ వ్యవహారాలు చూసుకుంటామని డబ్బులు వసూలు చేస్తే, వెంటనే 9849907703 ఫోన్ చేసి మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అధికారుల పేరు చెప్పి మోసాలకు పాల్పడే దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం వలన భవిష్యత్తులో భారీ నష్టాన్ని, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, అక్రమాలకు పాల్పడితే నిర్మాణదారుల తోపాటు దళారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.