ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
గంభీరావుపేట ఏప్రిల్ (15) (జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ నర్సా గౌడ్, అధ్యక్షతన డా” బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. , సర్పంచ్ మల్లు గారి పద్మ నరస గౌడ్ మాట్లాడుతూ
డాక్టర్”బి ఆర్ అంబేద్కర్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చరిత్రలో ఆయనకంంటూ కొన్ని పేజీలను సొంతం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్. స్త్రీ విద్య కోసం, దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి. ఆయన అసలు పేరు భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్. ఈయన 1891లో మధ్యప్రదేశ్‌లోని మోవ్ అనే గ్రామంలో పుట్టారు. అంబేద్కర్ వృత్తి రీత్యా న్యాయవాది, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త. అంతేకాదు మన భారత రాజ్యాంగం రూపకల్పనలో క్రీయశీలక పాత్ర పోషించిన వ్యక్తి అని తెలిపారు, పర్ష, హనుమన్లు మాట్లాడుతూ
అంబేద్కర్‌కి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి ఈ తరం కచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రమాన్ని అందరూ కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒక దళిత కుటుంబంలో పుట్టి.. ఎంతో కష్టపడి చదువుకుని ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. మేధస్సుతో పాటు.. మానవత్వం కూడా ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని తెలిపారు అంబేద్కర్ సంఘాల నాయకులు మాట్లాడుతూ
అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగానే కాదు.. సమాజంలో మార్పు కోసం పాటుపడ్డ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంబేద్కర్.అలాగే రాజకీయ నియంతృత్వాన్ని సామాజిక నియంతృత్వంతో పోల్చలేం. ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కంటే, సమాజాన్ని ఎదిరించే పౌరుడే ధైర్యశాలి.మతమార్పిడి ఎప్పుడూ ఉజ్వల భవిష్యత్తును అందించదు. జ్ఞాన మార్పిడి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకు అంబేద్కర్ జీవితమే ఒక నిదర్శనం!ఈ కార్యక్రమం లో అన్ని రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, కాంగ్రెస్ , బిజెపి , బిఆర్ఎస్ నాయకులు, ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు,
ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, వివిధ పార్టీల గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు


