నిర్భయంగా.. ముక్కుసూటి గా ధర్మ శాస్త్రాలను మంచి ప్రవచనాలు చెప్పే వ్యక్తి డాక్టర్ గరికిపాటి

మంథనిలో గరికిపాటి ప్రవచనాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రపురి ధర్మ ప్రచార సమితి ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శకుంతల ప్రవచనాలలో సహస్రవధాని పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు పాల్గొన్నారు. మంథని ప్రాంతానికి వచ్చిన వారిని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నిర్భయంగా ముక్కుసూటి గా ధర్మ శాస్త్రాలను మంచి ప్రవచనాలు చెప్పి వ్యక్తి డాక్టర్ గరికిపాటి. మంథని లో అనేక దేవాలయాలు ఉన్నాయని వాటికి దుపదీప నైవేద్యాలను పాటు మంత్ర ఉచ్చరణకు, వేయి పడగలు సంబంధించినటువంటి పీవీ నరసింహారావు కూడా ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో పెద్దలు అందరు చేసే మంత్ర ఉచ్చరణ చేస్తున్నారని అన్నారు. మే మాసంలో జరిగే అంత పుష్కరాల్లో పాల్గొనాలని శ్రీధర్ బాబు కోరారు. నన్ను గాని మా నాన్నగారిని గాని గుర్తు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ తరపున ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి గరికిపాటి నరసింహారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంథని ప్రాంతంలో ఉన్న ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారన్నారు.



