చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్
జనం సాక్షి.నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామానికి చెందిన ఆదిల్ అన్సార్ చదువులో మంచి ప్రతి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నిజామాబాద్ లోని ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి జిల్లా స్థాయిలో బైపిసి గ్రూప్లో ఐదవ ర్యాంకు సాధించగా విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక సేవాకర్త డాక్టర్ హకీమ్ ఈరోజు ఆదిల్ అన్సార్, అతని తల్లిదండ్రుల ను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మండలంలోని చేతన్ నగర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన యోగాజి అనే వ్యక్తి అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నందున ఆయనకు డాక్టర్ హకీమ్ అండగా నిలిచారు గ్రామ సర్పంచ్ సునీల్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు ఆసుపత్రి ఖర్చులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులు ఎజాస్ ఖాన్ మాట్లాడుతూ….పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆసరా, అభినందన, విద్యా, వైద్యం, ఆరోగ్యం వంటి సందర్భం ఏదైనా వారికి అండగా ఉండే ఏకైక నాయకుడు డాక్టర్ హకీమ్ అని ఉమ్మడి కోటగిరి మండల సీనియర్ నాయకుడు ఎజాస్ ఖాన్ గుర్తు చేశారు. డాక్టర్ హకీమ్ లాంటి నాయకులు పోతంగల్ మండలంలో ఉండడం మండలానికి గర్వకారణమని అన్నారు. నిత్యం పేద ప్రజల అవసరాల గురించి ఆలోచిస్తూ వారికి అండగా ఉండటం అభినందించదగ్గ విషయమని చెప్పారు. మండలంలో పేద ప్రజలకు అండగా నిలుస్తున్న హకీంకు ధన్యవాదాలు తెలిపారు. హకీమ్ లాంటి గొప్ప వ్యక్తులకు ఆ భగవంతుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ఆయన మున్ముందు మరిన్ని సేవలు ప్రజలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ హకీమ్ ను చేతన్ నగర్ సర్పంచ్ సునీల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైతన్ నగర్ సర్పంచ్ సునీల్, ఉప సర్పంచ్ నర్సింలు,నాయకులు షేరు, ఎజాస్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.


