రైతులు దళారీలను ఆశ్రయించొద్దు

పడకల్,లో వరి ధాన్యం,మొక్కజొన్న,ప్రొద్దు తిరుగుడు,కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి ఏప్రిల్ 15(జనంసాక్షి):ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న,వరి,ప్రొద్దు తిరుగుడు,ధాన్యాన్ని విక్రయించేందుకు దళారీలను ఆశ్రయించొద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు సూచించారు.మంగళవారం మండల పరిధిలోని పడకల్ గ్రామంలోని పిఎసిఎస్ సెంటర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత,వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ డోకురి సునీత ప్రభాకర్ రెడ్డి,సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి,పిఎసిఎస్ మాజీ చైర్మన్ కేశవరెడ్డి,లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.జిల్లాలో ఎక్కడ లేని విధంగా కేవలం పడకల్ గ్రామంలో ప్రొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి అప్పటి చైర్మన్ గంగారెడ్డి కృషితోనే ఇక్కడ కొనుగోలు కేంద్రం తీసుకొచ్చామని కేశవరెడ్డి గుర్తు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్మి మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి,ఏఎంసి డైరెక్టర్లు అంజయ్య గుప్తా,అజీమ్,శ్యాంసుందర్ రెడ్డి,మండల మహిళా అధ్యక్షురాలు రమాదేవి,నాయకులు డేవిడ్,యాదయ్య,కాడమోని శ్రీశైలం,రేణు రెడ్డి,అధికారులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.


