పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం పశువులకు సోకే గాలికుంట వ్యాధి నివారణకు టీకా కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని పశువులకు టీకాలు వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. గాలికుంటు వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా టీకాలు వేయించడం అవసరమని సూచించారు. ప్రభుత్వం రైతుల పశుసంపదను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్, ఉపసర్పంచ్ మారబోయిన ఐలయ్య, ప్రజాప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు