ఘనంగా లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం

 

 

 

 

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, మార్చి 14 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలోని లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో శుక్రవారం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. లీడేల్ లూమినారియా 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ హైదరాబాద్‌కే పరిమితమైన కార్పొరేట్ విద్యను పోచంపల్లికి తీసుకువచ్చి నాణ్యమైన విద్య అందిస్తున్న కర్నాటి ఎడ్యుకేషన్ సొసైటీ, స్కూల్ చైర్మన్ కర్నాటి శ్రావణ్ కుమార్‌ను ఆయన అభినందించారు.
మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా విద్యార్థులకు బోధించడం అభినందనీయమన్నారు. స్కూల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత సండ్ర సుధీర్, స్కూల్ అడ్వైజర్ రాధా, పట్టణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భారత లవ కుమార్, పాక మల్లేష్, వ్యాపారవేత్త సీతా హరిప్రసాద్, ప్రిన్సిపాల్ కాశీనాథ్, మేనేజర్ మురళి, పర్యవేక్షకులు మహమ్మద్ ఆజం, ఎర్ర జగన్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు